Saturday, July 31, 2021

*భవిష్యత్తు గురించి భయపడకుడి*

భవిష్యత్తు గురించి భయపడకుడి:-

భయపడటమనేది మన జీవితంలో ఒక భాగము. అది నిరంతరము జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక విషయం మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఈ భయము

వలన మనకు ప్రశాంతత ఉండదు. మన కన్నులకు నిద్రను దూరం చేస్తుంది. అష్ట

కష్టాలుపడి ఎలాగోలా నిద్రపోయినా, నిద్ర లేవగానే భయం మళ్ళీ మనల్ని ఆవరిస్తుంది.

డబ్బు సంపాదన గురించి, కుటుంబ పోషణ గురించి, భవిష్యత్తు గురించి ఒకటే భయం.

తరాలు తిన్నా తరగని డబ్బుంటే భయమేమైనా పోతుందా అంటే అదీ లేదు. కూడబెట్టిన

ఆస్తి ఎవడు కొట్టేస్తాడో, రోగాలు వచ్చి చస్తామేమో అన్న భయం మొదలవుతుంది.

భయమనేది ఎక్కడి నుండో రాదు. అది మన హృదయంలోనే, మన ఆలోచనలలోనే

ఉంటుంది. మనం చేసే పనులలోనే భయం ఉంటుంది. మన ఆలోచనలన్నీ ఈ లోక

సంబంధంగానే ఉండి, ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ, పాపాలు చేయడం

వలననే భయం మొదలవుతుంది. మనం జీవించే జీవితమే భయపడటానికి కారణం.

ఈ లోకంలో మనం ధైర్యంగా జీవించగలగటానికి మనం ఏర్పరచుకొనే ఆధారాలైన

మనుష్యులు కానీ, డబ్బు కానీ, హోదా కానీ ఏవీ మనకు ధైర్యాన్ని ఇవ్వలేవు. కేవలం

దేవుడు మాత్రమే మనకి ధైర్యాన్ని ఇవ్వగలడు. ఆదాము హవ్వలు దేవునితో మాట్లాడుతూ,

దేవునితో సహవాసం కలిగి ఉన్నంత వరకు వాళ్ళు ఎప్పుడూ భయపడలేదు. ఎప్పుడైతే

దేవుని ఆజ్ఞని మీరి తినవద్దని చెప్పిన పండు తిన్నారో, అప్పుడే వాళ్ళ జీవితంలోకి

మరణంతో పాటు భయము ప్రవేశించింది. అందుకే వాళ్ళు దాక్కోవాల్సిన పరిస్థితి

వచ్చింది. మనం కూడా దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తుంటాము కాబట్టే

దేవున్నిబట్టి ధైర్యంగా ఉండలేము. మనం నీతిగా జీవించినప్పుడు మాత్రమే ధైర్యంగా

ఉండగలము. 'నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు' (సామెతలు 28:1).

ఎందుకంటే నీతిమంతులు దేవుని మీద ఆధారపడి జీవిస్తారు. వాళ్ళు ఎవరికీ, దేనికీ

భయపడరు. 'నాతో కూడా వచ్చువాడు నా దేవుడైన యెహోవా' అన్న ధీమా వారిలో

ఉంటుంది. భక్తిహీనులు దేవున్ని ఆశ్రయించలేరు కాబట్టి వారి జీవితం భయముతోనే

ముగుస్తుంది. '

క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు. మహాభయముచేత వారు

కడముట్ట నశించుదురు' (కీర్తనలు 73:19). దేవుడు లేని జీవితాలలో భయము

స్థిరనివాసము ఏర్పరచుకుంటుంది. ఈ భూమి మీద మనం జీవించే అల్పకాలము

భయపడకుండా జీవించాలంటే 'నీతో కూడా వచ్చు వాడైన' దేవున్ని ఆశ్రయించాలి.

అందుకు నీవు సిద్ధమా?

ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము పాపము చేసి భయపడుతూ

జీవించకుండా మాతో కూడా వచ్చువాడవైన నిన్ను ఆశ్రయించే శక్తిని మాకు

దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.

No comments:

Post a Comment