బైబిల్ ఆవిర్భావం
దైవావేశమువలన కలిగినది
వేర్వేరు రచయితలు వ్రాసిన విభిన్న పుస్తకాలున్న బైబిలు ఒక చిన్న గ్రంథాలయం లాంటిది. వీరు సుమారు పదిహేను వందల సంవత్సరాల కాలవ్యవధిలో వేర్వేరు కాలాల్లో వేర్వేరు దేశాల్లో వేర్వేరు సందర్భాల్లో జీవించారు. మానవజాతిపట్ల దేవుని సంకల్పం వెల్లడికావడం వీరి రచనల్లో వున్న సాధారణాంశం. ఈ సంకల్పాన్నే హెబ్రీ పత్రిక రచయిత “పూర్వకాలమందు నానాసమయములలోను నానావిధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారునిద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను" (హెబ్రీ 1:1.2) అని సంక్షిప్తంగా వివరించాడు. మానవజాతి దేవునితో పునరైక్యత పొందవలసిన అవసరతను. మానవులు సాటివారితో సామరస్యంగా వుండవలసిన అవసరతను చాలా స్పష్టంగా వివరించే బైబిలు మానవజాతికి ఆయన అనుగ్రహించిన దివ్యసందేశం. యేసు క్రీస్తుద్వారా పరిపూర్తి చేయబడిన రక్షణ ప్రణాళికగురించి బైబిలు ఉద్ఘాటిస్తోంది. కాబట్టి అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలో "దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైయున్నది" (2 తిమోతి 3:16-17) అని సంగ్రహంగా వివరించాడు. బైబిలు దివ్యప్రేరితమైన దేవుని వాక్యం.
Genesis of the Bible
Possessed by divine passion
The Bible is like a small library with different books written by different authors. They lived in different countries at different times in a period of about fifteen hundred years. The revelation of God's will towards mankind is a common theme in their writings. This is the will of the writer of the book of Hebrews, "God, who spoke to our fathers through the prophets at various times and in various ways in the past, has spoken to us in these last days through the Son. He appointed that son as heir to everything. "He made the worlds through him" (Hebrews 1:1.2). He briefly explained the need for mankind to be reunited with God and the need for humans to be in harmony with their fellow humans. The Bible is the divine message that He blessed mankind with.
"He made the worlds through him" (Hebrews 1:1.2). He briefly explained the need for mankind to be reunited with God and the need for humans to be in harmony with their fellow humans. The Bible is the divine message that He blessed mankind with.
"ఆయన తన ద్వారా లోకాలను సృష్టించాడు" (హెబ్రీయులు 1:1.2). మానవజాతి దేవునితో మళ్లీ ఐక్యం కావాల్సిన అవసరాన్ని, మానవులు తమ తోటి మానవులతో సామరస్యంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన క్లుప్తంగా వివరించారు. ఆయన మానవాళికి అనుగ్రహించిన దైవిక సందేశం బైబిల్.
.jpeg)