Sunday, August 1, 2021

*దేవ దేవునికి లోబడాలి* మనుష్యులకు కాదు Tel & Eng.

నిస్సహాయ స్థితిలో తప్ప మనం ఎవరికీ లోబడి ఉండలేము. గత్యంతరం లేకపోతే తప్ప ఒక మనిషి ఇంకో మనిషికి లోబడి ఉండలేడు. ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే లోబడి ఉండాల్సిన అవసరం ఏమి ఉండదు. సరే, మనుష్యుల మధ్యలోనైతే బలము,

బలహీనతలు ఉంటాయి, ఎవరి టాలెంట్స్ వాళ్ళకుంటాయి, తాడెక్కెవాడు ఒకడుంటే

వాడిని తలదన్నేవాడు ఇంకొకడుంటాడు కాబట్టి, మనుష్యుల మధ్యలో లోబడి ఉండటం

అనేది వారి బలాన్ని బట్టి ఉంటుంది. మరైతే మనిషి దేవునికి లోబడి ఉండలేకపోవడానికి

కారణం ఏమిటి? ప్రపంచంలో ఏ మనిషైనా దేవుని కంటే గొప్పవాడా? శక్తిమంతుడా?

అయినప్పటికీ ఎందుకని మనిషి దేవునికి లోబడి ఉండలేకపోతున్నాడంటే, అందుకు

కారణం దేవుడు మనిషికి ఇచ్చిన ఆరోగ్యమే. ఈ ఆరోగ్యమే మనిషి గర్వానికి,

అహంకారానికి, అవిధేయతకు కారణం. ఈ ఆరోగ్యమే మనిషి దేవునితో సహా ఎవ్వరినీ

లెక్క చెయ్యకపోవడానికి కారణం. దేవుడు మనిషికిచ్చిన ఆరోగ్యము, తెలివితేటలను

ఆధారము చేసుకొని, నేను ఎలాగైనా బ్రతకగలను అన్న ధీమాతోనే దేవున్ని లెక్క

చెయ్యకుండా అవిధేయతతో జీవిస్తున్నాడు. 'అవిధేయులై యుండుట మానుకొని మీ

దుష్ట క్రియలనుబట్టి యెవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండు

నట్లు... యెహోవాకు లోబడియుండుడి' (యిర్మీయా 4:4). దేవుని ఉగ్రత మన మీదికి

వచ్చే లోపు మనము దేవునికి లోబడకపోతే మనకి వచ్చే శ్రమలకు మనదే బాధ్యత.

కోరహు గర్వించి మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుని కోపము అతని

మీదకు వచ్చింది. అతను ఏ మాత్రము పశ్చాత్తాపపడకపోవడం వలన నశించి

పోయాడు. అతడు తన అవిధేయతను విడిచిపెట్టి దేవునికి లోబడి మోషేను క్షమాపణ

అడిగినట్లైతే శిక్ష నుండి తప్పింపబడేవాడేమో. మనం కూడా అంతే దేవుడు మనకిచ్చిన

ఆరోగ్యాన్ని, తెలివితేటలనుబట్టి చాలా గర్విస్తాము. చాలామంది గర్వించి తమను

తాము హెచ్చించుకొని కోరహులా నాశనమవ్వడానికైనా సిద్ధపడతారు కాని దేవునికి

లోబడి తమ్మును తాము తగ్గించుకోరు. కాబట్టి లోబడనొల్లని ప్రజలను దేవుడు శిక్షిస్తాడు.

'మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను' (నిర్గమ. 33:3).

లోబడని వారితో దేవుడు ఉండడు కాబట్టి వారికి వచ్చే శ్రమలు, కష్టాలు, బాధలు

వారిని నాశనం చేస్తాయి. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యానికి, తెలివితేటలకు దేవునికి

కృతజ్ఞత చూపించి దేవునికి లోబడి ఉందాము.

ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీవు మాకు ఇచ్చిన

ఆరోగ్యము, తెలివితేటలనుబట్టి గర్వించక నీకు లోబడి ఉండే మనస్సు మాకు

దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.

We cannot be subject to anyone except in a state of helplessness. One man cannot be subject to another man unless otherwise. There is no need to be subject if there is any alternative. Well, strength among men,


There are weaknesses, whose talents are theirs, if Tadekkevadu is one


Obedience among men, because the one who beheads him is another


Depends on their strength. Otherwise man would not be subject to God


What is the reason? Is there any man in the world greater than God? Powerful?


Yet because man cannot be subject to God, that is why


The reason is the health that God has given to man. This health is what makes man proud,


The cause of arrogance and disobedience. This health is what man is to everyone, including God


Reason for not counting. God-given health and intelligence


Based on that, I count God with the slowness that I can live anyway


Living in disobedience without doing. 'Avoid being disobedient


Do not let my wrath burn like fire, so that no one can put out the evil deeds


Nuts ... obey the Lord '(Jeremiah 4: 4). The wrath of God is upon us


If we do not obey God before we come, we are responsible for our own troubles.


God was angry with Korah when he rebelled against Moses


Came on. He perished because he had no remorse


Poured. He renounced his disobedience and forgave Moses in obedience to God


Would have escaped punishment if asked. We are just as God-given


We are very proud of our health and intelligence. Many are proud of themselves


They exalt themselves and are willing to destroy Korah but to God


Do not reduce themselves to obedience. So God punishes disobedient people.


'I will come with you because you are a disobedient people' (Exodus 33: 3).


The hardships, hardships, and sufferings that come to those who disobey because God does not exist with them


Destroy them. To God for the health and intelligence that God has given us


Show gratitude and obey God.


Lord, you have given us as long as we live in this world


We have a mind that is subject to you without being proud of health and intelligence


Please ask in the name of Isaiah Father. Amen.

No comments:

Post a Comment